వీరవనిత చాకలి ఐలమ్మ ఆశయాలను విస్మరిస్తున్నారంటూ హరీష్ రావు ఆగ్రహం

రిపోర్టర్: అశోక్ స్థలం: సిద్దిపేట

గజ్వేల్లో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆఫీస్ వెల్లడించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం పెత్తందారుల మీద పోరాటం చేసి, పీడిత ప్రజల పక్షాన నిలిచిన గొప్ప వీరవనిత చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా ఆమె పోరాట పటిమ నిలిచిపోతుందని, నేటి తరాలు ఆమె ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.