ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామంలో మహాత్మా గాంధీ 157వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు మాట్లాడుతూ గాంధేయ మార్గంతోనే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అల్లాడ వెంకటరమణతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.