టాటా పవర్ కు భారీ షాక్: సింగపూర్ కోర్టులో క్లెరోస్ క్యాపిటల్ విజయం

రిపోర్టర్: కిరణ్ స్థలం: ముంబై

టాటా పవర్ కంపెనీకి సింగపూర్ కోర్టు నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలిందని, ఆర్బిట్రేషన్ వివాదంలో భాగంగా రూ.ఐదు వేల కోట్ల బకాయిల కోసం ఆ సంస్థ షేర్లను జప్తు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయని క్లెరోస్ క్యాపిటల్ వెల్లడించింది. రహస్య సమాచారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సింగపూర్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించిందని, దీంతో టాటా గ్రూప్ సబ్సిడరీల వాటాల విక్రయానికి మార్గం సుగమమైందని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.