మచిలీపట్నంలో భారీ రక్షణ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

రిపోర్టర్: శివ స్థలం: మచిలీపట్నం

మచిలీపట్నం కేంద్రంగా గోవా షిప్ యార్డ్ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.8 వేల కోట్ల పెట్టుబడితో బందరు పోర్టులో యుద్ధ నౌకల తయారీ, మరమ్మతుల కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. గోవా వెలుపల అతిపెద్ద రక్షణ రంగ ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనున్న దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక విధాన నిర్ణయాలు తీసుకున్నారు.