ఓట్ల తొలగింపుపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని వామపక్షాల డిమాండ్
రిపోర్టర్: గోపి
స్థలం: Jeelugumilli
దేశంలో కోట్లాది ఓట్ల తొలగింపునకు బాధ్యులైన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మండల సీపీఐ కార్యదర్శి కారం ధారయ్య డిమాండ్ చేశారు. జీలుగుమిల్లిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమి పిలుపుమేరకు ఈ నిరసన చేపట్టామని, వివాదాస్పద నిర్ణయాలపై ఉన్నతాధికారులు తక్షణమే సమీక్ష జరపాలని ఆయన స్పష్టం చేశారు.