మురసు తుపాను బీభత్సం: మంగళగిరిలో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: మంగళగిరి

మురసు తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ వర్షం కురిసిందని, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయని అధికారులు తెలిపారు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో నగరపాలక సంస్థ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారని, మోటార్లతో నీటిని తోడేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, అవసరమైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి స్పష్టం చేశారని వెల్లడించారు.