వాహనదారులు హైబీమ్ లైట్లు వాడొద్దని పోలీసుల హెచ్చరిక
రిపోర్టర్: సునీల్
స్థలం: విశాఖపట్నం
వాహనాలు నడిపేటప్పుడు హైబీమ్ లైట్ల వినియోగం వల్ల ఎదురుగా వచ్చే డ్రైవర్ల చూపు మందగించి తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని విశాఖపట్నం నగర పోలీసులు స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో మరియు రద్దీ రోడ్లపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా లోబీమ్ లైట్లను మాత్రమే ఉపయోగించాలని వాహనదారులకు సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తుందని, అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరించారు.