లివర్ దెబ్బతింటే చేతుల్లో ఈ ప్రమాదకర మార్పులు: డాక్టర్ హెచ్చరిక
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
మానవ శరీరంలో కీలకమైన కాలేయం దెబ్బతింటున్నప్పుడు వచ్చే ప్రమాదకర సంకేతాలను గ్లెనీగల్స్ అవేర్ హాస్పటల్ డాక్టర్ రమాకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత జీవనశైలి కారణంగా వేగంగా పెరుగుతున్న లివర్ వ్యాధులు ప్రారంభ దశల్లో ఎటువంటి లక్షణాలను చూపించవని తెలిపారు. అయితే అరచేతులు ఎర్రబడటం, గోళ్లు తెల్లబడటం, చేతులు వణకడం వంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని, వీటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.