బ్రహ్మోస్ క్షిపణుల దెబ్బకు పాకిస్థాన్ వణికిపోతోందంటూ కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్య
రిపోర్టర్: హరి
స్థలం: నొయిడా
భారత్‌లో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్‌కు నిద్ర లేకుండా చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గ్రేటర్ నొయిడాలో అంతర్జాతీయ ట్రేడ్ షో నాల్గో ఎడిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో రక్షణ రంగ ఉత్పత్తులు భారీగా పెరిగాయని, ప్రస్తుతం ఎనుబది దేశాలకు మన ఆయుధాలు ఎగుమతి అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చాక మాఫియా అంతమైందని వివరించారు.