ఫేక్ ఆన్లైన్ సంపాదన మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: తెలంగాణ పోలీస్ హెచ్చరిక

రిపోర్టర్: రమేష్ స్థలం: Telangana

పెద్ద హామీలు ఇస్తూ భారీ మోసాలకు పాల్పడే ఫేక్ ఆన్లైన్ సంపాదన పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీస్ స్పష్టం చేశారు. ఆకర్షణీయమైన ప్రకటనలతో నమ్మించి నిలువునా మోసం చేసే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకూడదని సూచించారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలను హెచ్చరిస్తూ అప్రమత్తత చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మోసపూరిత లింక్లు మరియు అపరిచితుల కాల్స్ పట్ల తీవ్ర అప్రమత్తత అవసరమని అధికారులు తేల్చిచెప్పారు.