సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైఎస్సార్సీపీకి తీవ్ర నష్టమంటూ విజయసాయిరెడ్డి ధ్వజం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విశాఖపట్నం

వైఎస్సార్సీపీకి సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే తీవ్ర నష్టం జరుగుతోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి వద్ద తనను దుర్మార్గుడిగా చిత్రీకరించిన వ్యక్తి సజ్జలనేనని ఆయన ఆరోపించారు. మద్యం కుంభకోణంలో తన ప్రమేయం లేదని, ఇందులో కర్త, కర్మ, క్రియ రాజ్కెసిరెడ్డేనని స్పష్టం చేశారు. ఈ కేసులో తనకు తెలిసిన విషయాలన్నింటినీ సిట్ అధికారులకు వివరించినట్లు ఆయన తెలిపారు.