గజ్వేల్ రోడ్డు దుస్థితిపై మండిపడ్డ నేత: శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండ్
రిపోర్టర్: రమేష్
స్థలం: గజ్వేల్
గజ్వేల్-చేగుంట ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని తెలంగాణ రక్షణ సేన నాయకుడు సిలివేరి ఇంద్రగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మారెడ్డిపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద సీసీ రోడ్డు ధ్వంసమై ఇనుప చువ్వలు బయటకు తేలడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని తీవ్రంగా హెచ్చరించారు.