పుంగనూరు హింసాత్మక ఘటనలపై ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు: వర్ల రామయ్య డిమాండ్
రిపోర్టర్: గోపి
స్థలం: Amaravati
రాయలసీమలో స్థానిక ఎన్నికల సందర్భంగా వైసీపీ శ్రేణులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని టీడీపీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్సీ వర్ల రామయ్య వెల్లడించారు. పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయన కదలికలపై ఆంక్షలు విధించాలని కోరారు. కిరాయి షూటర్ల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఈసీని డిమాండ్ చేసినట్లు తెలిపారు.