కరణం సురేష్ సేవలను కొనియాడిన లావేటి రమేష్

రిపోర్టర్: RAMESH LAVETI స్థలం: రేగిడి ఆమదాలవలస

విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస ప్రాంతంలో జన్మించిన సీనియర్ మీడియా రిపోర్టర్ కరణం సురేష్ అందిస్తున్న సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని రాజాం నియోజకవర్గం వాసి లావేటి రమేష్ తెలిపారు. జర్నలిజం రంగంలో ఆయన చేసిన నిరంతర సేవలను చూసి స్థానిక సామాన్యులు సైతం అభినందనలు తెలియజేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మీడియా రంగంలో సురేష్ సేవా దృక్పథం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.