మాచర్లలో ద్విచక్ర వాహనం బోల్తా పడి వ్యక్తి దుర్మరణం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఘట్టు

మాచర్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొనడంతో 9వ వార్డుకు చెందిన శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.