విశాఖ తీసుకెళ్లలేదని రెండో భర్తను హతమార్చిన మహిళ

రిపోర్టర్: రాము స్థలం: విజయనగరం

విశాఖపట్నం తీసుకెళ్లాలని భర్తను ఒత్తిడి చేసిన మహిళ, అతను నిరాకరించడంతో కుటుంబ కలహాల నేపథ్యంలో దారుణ హత్యకు పాల్పడింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేట గ్రామానికి చెందిన దనాల శ్రీనును అతని భార్య రాములమ్మ సిమెంట్ దిమ్మతో తలపై కొట్టి, వేడి నూనె పోసి చంపేసింది. అనంతరం ఆమె చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.