టెక్కలి రైలు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భువనేశ్వర్ నుండి గణుపూర్ వెళుతున్న రాజారాణి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలపై నడుస్తున్న విద్యార్థులను ఢీకొనడంతో విశాఖ రావు, దిలీప్, శివ, శరత్ కుమార్ ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన సాల్మన్ రాజుకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.