సెల్ఫీ వీడియో కలకలం: ఈశ్వర్ ఆత్మహత్య కేసులో రాజకీయ నేత అరెస్ట్

రిపోర్టర్: రాజేష్ స్థలం: నవాబుపేట

నవాబుపేట మండల పరిధిలోని పోమాల గ్రామంలో ఈశ్వర్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మృతుడు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఆధారంగా పిడుగు సుధాకర్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్సై వాకిటి నరేందర్ తెలిపారు. అక్రమ సంబంధం మరియు వేధింపుల కారణంగానే ఈశ్వర్ ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న భార్య, అత్తమామల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.