గణేశ్ నిమజ్జన భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సైబరాబాద్ సీపీ రమేశ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

గణేశ్ నిమజ్జనాల సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పీఎస్ఐఓసీ భవనం నుంచి సీసీ కెమెరాల ద్వారా సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేశ్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. నిమజ్జన మార్గాల్లో నెలకొన్న ట్రాఫిక్ పరిస్థితులు, ప్రజల రద్దీని ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం నార్సింగి పరిధిలోని కోకపేట చెరువును సైబరాబాద్ సీపీ స్వయంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న నిమజ్జన ప్రక్రియను, భద్రతా చర్యలను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.