గోదావరి కాలుష్యంపై ఆంధ్రా పేపర్ మిల్లుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం గోదావరి కాలుష్యానికి ఆంధ్రా పేపర్ లిమిటెడ్ ప్రధాన కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు ఎగ్గొడుతూ, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆ పరిశ్రమకు వెంటనే సమన్లు జారీ చేయాలని కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించారు. తప్పు సరిదిద్దుకోని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలుష్యంపై పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు స్థానికంగా సంచలనం సృష్టించాయి.