తాజ్ మహల్ సందర్శించిన ప్రపంచ నెంబర్ వన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Agra
ప్రపంచ నెంబర్ 1 యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ జిమ్మీ డోనాల్డ్‌సన్ తన భార్య థియా బూయ్సన్‌తో కలిసి ఆగ్రాలోని ప్రసిద్ధ తాజ్ మహల్‌ను సందర్శించారు. తూర్పు గేట్ గుండా లోపలికి వెళ్లిన ఈ జంట తాజ్ మహల్ వాస్తుశిల్పాన్ని తిలకించారు. మిస్టర్ బీస్ట్ రాకతో ఆగ్రాలో సందడి నెలకొనగా, ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. సెల్ఫీల కోసం జనం ఎగబడటంతో పోలీసులు ఆయనను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. చిన్నారి అభిమాని ఇచ్చిన స్కెచ్‌బుక్ బహుమతి చూసి ఆయన ఎంతో ఆనందించారు.