వైవిధ్యమైన కథతో రాబోతున్న రొమాంటిక్ క్రైమ్ డ్రామా డానీ ఫస్ట్ స్ట్రైక్ విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
ఆశిష్ గాంధీ హీరోగా కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ క్రైమ్ డ్రామా సినిమా డానీ. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్‌లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఫస్ట్ స్ట్రైక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం బోల్డ్, రా అండ్ రస్టిక్‌గా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు.