ఉమాంగ్ యాప్ ద్వారా యూఏఎన్ సేవలు: వివరాలు వెల్లడించిన కేంద్ర కార్మిక శాఖ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Andhra Pradesh / Telangana
ఉమాంగ్ యాప్ ద్వారా సులభంగా తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ను పొందవచ్చని, యాక్టివేట్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నంబర్ ద్వారా ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో లాగిన్ అయి ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చని, పాస్‌బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చని, క్లెయిమ్ స్థితి తెలుసుకోవచ్చని తెలిపింది. అలాగే కేవైసీ అప్డేట్ వంటి ముఖ్యమైన సేవలను కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చని పేర్కొంటూ ఉద్యోగులకు కీలక సూచనలు చేసింది.