పాలకొల్లులో మొబైల్ అన్న క్యాంటీన్ వద్ద లండన్ దంపతుల ఉచిత భోజన వితరణ

రిపోర్టర్: రమేష్ స్థలం: పశ్చిమ గోదావరి

పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలోని మొబైల్ అన్న క్యాంటీన్ వద్ద లండన్కు చెందిన ప్రభాకర్, సౌజన్య దంపతులు తమ కుమార్తెలు మేఘ, వర్షల పదహారవ పుట్టినరోజు సందర్భంగా ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారని జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సందర్భంగా సమాజ సేవ పట్ల ఆ దంపతులు చూపుతున్న చొరవను అభినందిస్తూ ఆయన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరుపేద రోగులకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.