తాజ్ ప్రచాప్ మ్యాచ్ ముందు ఆండ్రోస్ టౌన్ సెండ్ కు ప్రమాదం

రిపోర్టర్: నరేష్ స్థలం: World

థాయ్ లీగ్ వన్ క్లబ్ పీటీ ప్రచాప్ తరఫున ఆడుతున్న మాజీ ఇంగ్లండ్ ఇంటర్నేషనల్ ఆటగాడు ఆండ్రోస్ టౌన్ సెండ్ ప్రాక్టీస్ సెషన్ లో ఘోర ప్రమాదానికి గురయ్యాడు. పట్టాని ఎఫ్ సీ తో మ్యాచ్ కు ముందు వార్మప్ చేస్తుండగా మైదానంలో రోలర్ వాహనం ఆయన పై నుంచి వెళ్లడంతో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ బయటపడిన ఆయన మళ్లీ కోలుకుని మ్యాచ్ లోనూ పాల్గొని ఆడాడు.