పుంగనూరులో ఉద్రిక్తత: టీడీపీ వైఎస్సార్సీపీ శ్రేణుల పరస్పర రాళ్ల దాడిలో తీవ్రగాయాలు
రిపోర్టర్: మహేష్
స్థలం: అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లా పుంగనూరులో నామినేషన్ల తొలిరోజే వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగిందని జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ అడ్డుకోవడంపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి, పరస్పర రాళ్ల దాడికి దారితీసింది. ఈ ఘర్షణలో పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు మధు రాయల్ తల పగలడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.