ఎమ్మెల్యే పూజా పాల్ ఖాతా నుంచి లక్షన్నర నగదు మాయం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఉత్తర్ ప్రదేశ్
ఉత్తర్ప్రదేశ్ కౌశంబీ జిల్లాలో చాయల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పూజా పాల్ సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారు. ఫోన్‌పే ద్వారా తన ప్రమేయం లేకుండానే యూనియన్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.55 లక్షలు డ్రా అయినట్లు ఆమె గుర్తించారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 13 మధ్య విడతల వారీగా నగదు మాయమైనట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఐఫోన్ హ్యాక్ చేసి ఈ లావాదేవీలు నిర్వహించి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.