ప్రజల పక్షాన నిలిచిన పువ్వాడ జన్మదిన వేడుకలు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం అర్బన్ మండలంలో సీపీఐ సీనియర్ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు 88వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీపీఐ ఖానాపురం హవేలీ శాఖ, ఏఐటీయూసీ మమత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల పక్షాన నిలిచి ఎర్రజెండా ఉద్యమానికి ఆయన చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ ఏనుగు గాంధీ, నానబాల రామకృష్ణ తదితరులు పాల్గొని ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.