లడఖ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటు

రిపోర్టర్: సునీల్ స్థలం: Ladakh

లడఖ్లో ఐఐఎం జమ్మూ శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటుకు కేంద్ర పాలిత ప్రాంత యంత్రాంగం మరియు ఐఐఎం జమ్మూ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు. లెహ్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాంగణం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన మేనేజ్మెంట్ విద్య అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ నుండి ప్రారంభమయ్యే ఈ నాలుగు సంవత్సరాల బీబీఏ ఆనర్స్ కోర్సులో తొలి విడతగా అరవై సీట్లను కేటాయించామని అధికారులు వెల్లడించారు.