కొమ్మికలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి మహా అన్న సమారాధన

రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు స్థలం: కొయ్యూరు

కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ పరిధిలోని కొమ్మిక గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్న సమారాధనలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. విఘ్నేశుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో విజయవంతంగా సాగింది.