శిశువుల ఆహార ఉత్పత్తులపై నిబంధనలు కఠినతరం చేసిన మహారాష్ట్ర ఎఫ్డీఏ

రిపోర్టర్: సునీల్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలో శిశువుల ఆహార ఉత్పత్తుల ప్యాకింగ్పై తల్లిపాలే శ్రేయస్కరమనే హెచ్చరికను తప్పనిసరి చేస్తూ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్డీఏ తుకారం ముండే నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫార్ములా మిల్క్పై ఎలాంటి నిషేధం లేదని, అయితే ఉల్లంఘనలకు పాల్పడే తయారీదారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.