అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ రవికుమార్కు ఆర్థిక సాయం

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం ముప్పై తొమ్మిదవ డివిజన్కు చెందిన జర్నలిస్ట్ రవికుమార్ కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలుసు లక్ష్మి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. రవికుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో బాధితుడికి అండగా నిలుస్తూ ఆమె స్వయంగా ఆర్థిక సాయం అందజేశారు.