ఎన్నికల సంఘం తీరుపై మండిపడిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
ఎన్నికల సంఘం తీరుపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసీ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 2022 ఎన్నికల్లో తమ ఓట్లు చోరీ కాకపోతే ఉత్తరప్రదేశ్లో ఎస్పీ ప్రభుత్వమే ఏర్పడేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదన్న ఆయన, ఈసీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.