వీబీజీ రామ్‌జీ పథకంలో భారీ అక్రమాలు: నిజామాబాద్‌లోనే పక్కదారి పట్టిన లక్షలు
రిపోర్టర్: శివ
స్థలం: నిజామాబాద్
గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మందిన వీబీజీ రామ్‌జీ అమలులో భారీ అవినీతి జరుగుతోందని రైతుకూలీ సంఘాలు ఆరోపించాయి. నిజామాబాద్ జిల్లాలో తాజాగా నిర్వహించిన సోషల్ ఆడిట్లో పదకొండకు పైగా అక్రమాలు వెలుగుచూశాయని, కేవలం ఒక్క జిల్లాలోనే అరవై ఏడు లక్షలకు పైగా నిధులు పక్కదారి పట్టాయని అధికారులు తెలిపారు. చెరువుల్లో పూడికతీత పనులు చేయకుండానే చేసినట్లు లెక్కలు రాసి, వనమహోత్సవం పేరుతో నిధులు కాజేస్తున్నారని రైతుకూలీ సంఘాలు మండిపడ్డాయి.