బీసీల రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామన్న మంత్రి వాసంశెట్టి సుభాష్

రిపోర్టర్: Y.V.RAMANA స్థలం: రామచంద్రాపురం

రామచంద్రపురం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేయడంపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తామని స్పష్టం చేస్తూనే బీసీ వర్గాలకు పూర్తి న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. రిజర్వేషన్ల అమలుకు కూటమి ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని మంత్రి తేల్చిచెప్పారు.