నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లు, ధాబాలపై ఖమ్మం అధికారుల కొరడా

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని హోటళ్లు, ధాబాలపై మొత్తం పదకొండు కేసులు నమోదు చేశారు. వంటకంలో బల్లి కనిపించిన రమేష్ ధాబాకు కోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. హావెలీ, రిలయన్స్ రిటైల్, డిలైట్ మండీ సంస్థలకు సైతం అధికారులు జరిమానాలు వేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించడంతో స్థానికులు ఈ నిర్ణయాలను స్వాగతిస్తున్నారు.