ఏపీలో నాన్-యూనిఫాం ఉద్యోగాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు
రిపోర్టర్: సురేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త అందించింది. నాన్-యూనిఫాం ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపు 20సెప్టెంబర్ 2027 వరకు వచ్చే నోటిఫికేషన్లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే పోలీస్, ఎక్సైజ్ తదితర యూనిఫాం పోస్టులకు ఈ మినహాయింపు వర్తించదని పేర్కొంది.