పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ కేంద్రంలో అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం ప్రారంభించనున్నారు. సినీ హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన చొరవతో ఈ పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాన్ని అన్ని హంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.