పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ అడ్డుకున్న దళితులు
రిపోర్టర్: సురేష్
స్థలం: పిఠాపురం
కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ను ఎమ్మార్పీఎస్ నాయకులు, దళితులు అడ్డుకున్నారు. జీవన్ నగర్‌లో దళితుల శ్మశానవాటికను కబ్జా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కబ్జాపై పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై అసంతృప్తి వెలిబుచ్చారు. ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.