'ఆ పాట కోసం ఏకంగా 200 టేక్స్ తీసుకున్న అరిజిత్ సింగ్': రామాయణం సినిమా విశేషాలు
రిపోర్టర్: రాము
స్థలం: India
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణం' కోసం ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ భక్తి భావంలో లీనమై 'జై జై రామ్' అనే గీతం కోసం ఏకంగా 200 టేక్స్ రికార్డ్ చేసినట్లు సమాచారం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటను డాక్టర్ కుమార్ విశ్వాస్ రాయగా, శ్రేయా ఘోషాల్తో కలిసి అరిజిత్ సింగ్ ఆలపించారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా 2026, 2027 దీపావళి సీజన్లలో విడుదల కానుంది.