8వ వేతన సంఘంతో కేంద్ర ఉద్యోగుల జీతాలు రెట్టింపు?

రిపోర్టర్: హరి స్థలం: India

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు 8వ వేతన సంఘంపై ఆసక్తి పెరుగుతోంది. డీఏను బేసిక్ పేలో విలీనం చేయాలన్న డిమాండ్ చర్చనీయాంశమైంది. ఇది అమలైతే లెవెల్-6 ఉద్యోగుల బేసిక్ పే రూ.74,340 నుంచి రూ.1.52 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.