పాంచ్కులా ప్రభుత్వ పాఠశాలలో దారుణం: చిన్నారిపై ఎనిమిదేళ్ల బాలుడి దాడి

రిపోర్టర్: నరేష్ స్థలం: పాంచ్‌కులా

హర్యానా రాష్ట్రం పాంచ్కులాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలుడు కిండర్ గార్టెన్ చిన్నారిపై దారుణంగా దాడి చేశాడని పోలీసులు తెలిపారు. చిన్నారి తండ్రి బయట ఉన్నాడని నమ్మించి ఖాళీ గదిలోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టడంతో పాటు బల్లలకేసి తల బాదినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అధికారులు వెల్లడించారు. ఈ అఘాయిత్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయగా, ప్రస్తుతం గాయపడిన చిన్నారి పిజీఐ చండీగఢ్ లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.