'పరీక్షల షెడ్యూల్ విడుదల..': ఎన్‌టీఏ కీలక ప్రకటన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: India
దేశవ్యాప్తంగా నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం విడుదల చేసింది. డిసెంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు నిర్వహించనున్న 14 ప్రధాన పరీక్షల తేదీలను ఎన్‌టీఏ ఖరారు చేసింది. ఇందులో భాగంగా యూజీసీ-నెట్ పరీక్ష డిసెంబర్ 14 నుంచి 19 వరకు, జేఈఈ మెయిన్ సెషన్-1 జనవరి 22 నుంచి 30 వరకు జరగనున్నాయి. అభ్యర్థులు తమ విద్యా కార్యకలాపాలను ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకునేందుకు ఈ క్యాలెండర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఏజెన్సీ స్పష్టం చేసింది.