క్రీడా పోటీల ప్రారంభంతో ఉత్సాహంగా మారిన పీజేఆర్ స్టేడియం
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
పీజేఆర్ స్టేడియంలో నాలుగు రోజుల క్రీడా సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ నేత అట్టేపల్లి రామప్రభు టాస్ వేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరవై మంది పీఈటీలకు ప్రత్యేకంగా టీ-షర్టులు మరియు క్యాప్‌లను అందజేశారు. క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.