కోదాడలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా యువత చేరిక: బొల్లం మల్లయ్య యాదవ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: కోదాడ

కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ప్రజలు మరోసారి కేసీఆర్ నాయత్వాన్ని కోరుకుంటున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు. కోదాడ పట్టణ పరిధిలో వివిధ పార్టీలను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువతకు ఆయన గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఆయన, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.