మురసు తుపాను నష్టంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు లేఖ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
మురసు తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఎనిమిది శాఖలకు సంబంధించి మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏడు జిల్లాల్ లో యాభై వేలకు పైగా హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్ లో సహాయక చర్యలను వివరిస్తూ, తక్షణమే ఆర్థికసాయం అందించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.