అమెరికాలో ఫెడరల్ తనిఖీలు లేని మాంసం వెనక్కి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమెరికా
అమెరికాలో ఫెడరల్ తనిఖీలు లేకుండా ఉత్పత్తి చేసి సరఫరా చేసిన సుమారు లక్షా అరవై ఏడు వేల పౌండ్ల పంది, గొడ్డు, మేక మాంసాన్ని అమెరికా వ్యవసాయ శాఖ వెనక్కి పిలిపించింది. స్టార్ మీట్ డెలివరీ, ఏఅండ్ డీ ఫుడ్స్ సంస్థలు తప్పుడు లేబుళ్లతో దేశవ్యాప్తంగా రిటైలర్లు, రెస్టారెంట్లకు ఈ ఉత్పత్తులను పంపినట్లు అధికారులు గుర్తించారు. ఈ మాంసంలో హానికరమైన బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.