మాజీమంత్రి వివేకా హత్య కేసులో ఈడీ ఎదుట సునీల్ యాదవ్ సంచలన విషయాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: పులివెందుల
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారుల ఎదుట ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ సంచలన విషయాలు వెల్లడించారు. రెండో రోజు విచారణకు హాజరైన ఆయన, హత్యకు కుదిరిన సుపారీ ఒప్పందం మరియు నిధులు సమకూర్చిన వ్యవహారంపై అధికారులకు కీలక సమాచారం అందించినట్లు తెలిసింది. తనకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని మొరపెట్టుకోగా, అధికారులు అభయమిచ్చారు. పులివెందులలోని ఒక కీలక నేత ప్రధాన అనుచరుడి ద్వారానే ఆర్థిక లావాదేవీలు నడిచాయని సునీల్ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.