ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: వికారాబాద్

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలను తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పాలిటెక్నిక్ విద్యా విధానంలో మార్పులు చేస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఉపాధ్యాయులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయాలని చూసే వారి మాటలను నమ్మవద్దని, పారదర్శకంగా బదిలీలు, పదోన్నతులు కల్పించామని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తూ, రిటైర్మెంట్ ప్రయోజనాలను సకాలంలో అందిస్తున్నామని తెలిపారు.