బొబ్బిలిలో ఘనంగా గాంధీ జయంతి: విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బేబీనాయన

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలిలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావుతో పాటు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు ప్రముఖుల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.